Über Oo Kalam Gnapakam
గౌరీశంకర్ గారి కలం నుండి వెలువడిన 'ఓ కలం జ్ఞాపకం'లో విశ్వనరుడు జాషువా, గురజాడ, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, చలం, కొడవటిగంటి, జంధ్యాల, తిరుమల రామచంద్ర, పాలగుమ్మి పద్మరాజు, నార్లవారితో పాటు బుచ్చిబాబు, పఠాభి, రావిశాస్త్రి, దాశరథి, ఆరుద్రలను.. అలాగే, వాసిరెడ్డి సీతాదేవి, సావిత్రి, ఆలూరి బైరాగి, మరియు చెరబండరాజు, అలిశెట్టి ప్రభాకర్, గంటేడ గౌరునాయుడు, ప్రసాదమూర్తి వంటి సమకాలీన, ప్రసిద్ధ కవుల జ్ఞాపకాల పుటలు విప్పి మనకు తెలియని ఎన్నో అంశాలను అక్షరీకరించారాయన. ఓ రచన చేయడానికి గల కారణాలు, చేయాలంటే రచయితలు పడిన మథనం, ఒక్కొక్క అక్షరం వెనుక గల వేదన, తపనలను ప్రత్యేకంగా స్పృశించి మన ముందుంచారు.
- లోగిలి (అంతర్జాల పత్రిక)
Mehr anzeigen